గోపన్‌పల్లి లోమహానీయులైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి
- Whitesilicon News
- 6 hours ago
- 1 min read

మహానీయులైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈ రోజు గోపన్‌పల్లి అంగన్‌వాడి పాఠశాల దగ్గర ఉన్న పూలే-అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరుపటి జైపాల్ గారు మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ జగదీష్ గౌడ్ గారు, ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది .ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లగండ్ల డివిజన్ శ్రీ *పల్లపు సురేందర్* గారి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతరావు ఫూలే గారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఫూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక యువకులు ప్రజలకు ఆయన ఆశయాలను వివరించి, సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రాజు నాయక్, హనుమంతు, రాజు, అనిల్, శ్రీశైలం,నాయకులు, యువత, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి ఆశయాలను కొనసాగించడానికి సంకల్పం వ్యక్తం చేశారు.



Comments